
విజయ్ దేవరకొండ, రష్మిక మందనల ప్రేమ కధ పెళ్ళి పీటల వరకు ఇంకా ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ వారిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా పూర్తి చేస్తున్నారు. దాని తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చారిత్రిక నేపధ్యంతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది.
వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో రష్మికని హీరోయిన్గా తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దానిపై రష్మిక స్పందిస్తూ ‘అవును ఎదురుచూడాలి,’ అనే భావం వచ్చేలా చిన్న మెసేజ్ పెట్టి పక్కనే ‘లవ్ సింబల్’ పెట్టింది. అంటే మళ్ళీ ఇంతకాలానికి ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక సినిమాలో నటించబోతోందన్న మాట!
ఆమె పుష్ప-2 పూర్తి చేసిన తర్వాత ‘గర్ల్ ఫ్రెండ్’ అనే హీరోయిన్ ఓరియంటడ్ సినిమా చేసింది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సినిమా చేయబోతోంది.
ఇది విజయ్ దేవరకొండకు 14వ సినిమా. దీనిని ప్రకటించినప్పుడు, “వీరగాధలు లిఖించబడవు... అవి వీరుల రక్తం నుంచే ఆవిర్భవిస్తాయి. ఓ శాపగ్రస్తమైన సామ్రాజ్యానికి చెందిన ఓ వీరుడిని పరిచయం చేస్తున్నాము..,” అంటూ 18వ శతాబ్ధంలో జరిగిన ఓ చారిత్రిక నేపధ్యం కలిగిన కధతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ సూచించారు.