బాహుబలి-2 వీడియో లీక్.. నిందితుడు అరెస్ట్..!

బాహుబలి-2 నుండి అనుష్క ఫైటింగ్ సీన్ ఒకటి నిన్న సాయంత్రం నుండి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. అయితే బాహుబలి లాంటి సినిమాకు ఇలాంటి లీకుల గతి పట్టడం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా సరే లీక్ అవడం జరిగింది. లీక్ అయిన వెంటనే ఎలర్ట్ అయిన టీం సైబర్ క్రైం వారికి కంప్లైంట్ చేయడం. వెంటనే రంగంలో దిగిన పోలీసులు త్వరగానే ఆ నిందితున్ని పట్టుకోవడం అంటా అయ్యింది. 

బాహుబలి  గ్రాఫిక్స్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అయితే ఈ క్రమంలో కృష్ణ అనే గ్రాఫిక్స్ ఎడిటర్ ఈ వీడియోని లీక్ చేసినట్టు తెలుస్తుంది. వీడియో దొంగిలించి ఆ తర్వాత విజయవాడ వెళ్లిన అతన్ని విజయవాడ పోలీసులే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం హాట్ న్యూస్ గా నడుస్తున్న ఈ వీడియో యూట్యూబ్ నుండి తొలగించారు.   

ఇక ఈ విషయం పట్ల దర్శక నిర్మాతలు చాలా సీరియస్ గా ఉన్నారట. పెద్ద సినిమాలు ఇలా లీక్ బాట పట్టడం వల్ల చాలా పెద్ద మొత్తంలో లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇకనుండి సినిమాకు పనిచేసే ప్రతి యూనిట్ ను నియమ నిబంధనలు పెట్టి వర్క్ చేయించాలని అనుకుంటున్నారు.