
సినిమాలలో నటించాలని లక్షలాది మంది కలలుగంటారు. కానీ అందరికీ ఆ అవకాశం లభించదు. కనుక అవకాశం వచ్చినప్పుడు తప్పక సద్వినియోగం చేసుకోవాలి.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘14 రీల్స్ ప్లస్’ తమ బ్యానర్‌పై నిర్మించబోయే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలని కోరుతూ సోషల్ మీడియాలో క్యాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చింది.
20-30 లోపు వయసున్న మగవారు, 20 సంవత్సరాలు వయసున్న ఆడవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. హీరో, హీరోయిన్‌లు, క్యారక్టర్ యాక్టర్స్, ఇతర సపోర్టింగ్ నటీనటుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపింది.
ఆసక్తి గల యువతీ యువకులు తమ బయోడేటా, ఫోటో, వీడియోలతో కూడిన ఆడిషన్ టేప్స్ casting.14reeelsplus@gmail.com కు పంపవలసిందిగా కోరింది. సెల్ఫీ ఫోటోలు, వీడియోలు అంగీకరించబోమని ముందే చెప్పింది.
కనుక సినిమాలలో నటించాలనే ఆసక్తి గల యువతీ యువకులు వెంటనే ‘14 రీల్స్ ప్లస్’ ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది.