1.jpg)
ఇటీవల విడుదల చేసిన #సింగిల్ సినిమా ట్రైలర్లో కొన్ని పదాలు మంచు విష్ణు మనోభావాలు దెబ్బతీసినట్లు వార్తలు రావడంతో హీరో శ్రీవిష్ణు వెంటనే స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తాము ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఆ పదాలను వాడలేదని, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నవాటినే తీసుకొని ట్రైలర్ చేశామని శ్రీ విష్ణు అన్నారు. అయినప్పటికీ సింగిల్ ట్రైలర్లో సంభాషణల వలన కన్నప్ప టీమ్, మంచు విష్ణు హర్ట్ అయ్యారని తెలియగానే ఈ వీడియో ద్వారా క్షమాపణలు చెపుతున్నామన్నారు. మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతామన్నారు. సినీ పరిశ్రమలో అందరూ ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఉంటాము కనుక ఎవరినీ బాధ పెట్టాలని అనుకోమన్నారు. సింగిల్ ట్రైలర్, సినిమా నుంచి తక్షణమే ఆ సీన్స్ తొలగించామని చెప్పారు. శ్రీ విష్ణు ఏమన్నారో ఆయన మాటల్లోనే..
#single sorry pic.twitter.com/0qid5xWcWQ
— devipriya (@sairaaj44) April 30, 2025