శర్వానంద్‌ సినిమా టైటిల్‌ భోగి!

శర్వానంద్‌-అనుపమ పరమేశ్వరన్ శతమానం భవతి సినిమాలో కలిసి చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హాయతి కూడా నటిస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘భోగి’ అని పేరు ఖరారు చేశారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంపత్ నంది చెప్పారు. 

నేడు (బుధవారం) నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా భోగి టైటిల్‌ గ్లింమ్స్‌ విడుదల చేశారు. దానిలో దర్శకుడు సంపత్ నంది 1960లో జరిగిన కధని చెపుతుండగా శర్వానంద్ దానిని ఆసక్తిగా వింటున్నట్లు చూపుతూ, సినిమా కాన్సెప్ట్ ‘అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాలు’ అని తెలియజేశారు.