సింగిల్ ట్రైలర్‌ ఇరగదీశారుగా శ్రీవిష్ణు, వెన్నెల

కార్తీక రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఇవాన ప్రధాన పాత్రలలో #సింగిల్ అంటూ సరదా సరదా కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అందరూ కలిసి మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కనుక పనిలో పనిగా ట్రైలర్‌ వదిలారు. దానిని శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరూ కలిసి ఇరగ దీసేశారు. ఇదే రేంజ్‌లో కామెడీ సినిమాలో సరిగ్గా తెరకెక్కించి ఉంటే వారి కెరీర్‌లో ఇదో సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తుంది. 

ఇటీవలే విడుదల చేసిన ‘సిరాకైంది సింగిల్ బతుకు..’ పాటకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కార్తీక రాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: ఆర్‌. వేల్ రాజ్, డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగన, ఆర్ట్: చంద్రిక గొర్రిపాటి, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు. 

గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ బ్యానర్లపై విద్యా కొప్పయినిధి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మించిన ఈ #సింగిల్ మే 9న విడుదల కాబోతోంది. 

దీని తర్వాత శ్రీవిష్ణు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ‘మృత్యుంజయ్‌’ అనే సినిమా చేస్తున్నారు.