ఎన్టీఆర్‌-నీల్ స్పెషల్ గ్లింమ్స్‌, సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే..

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ 31వ సినిమా స్పెషల్ గ్లింమ్స్‌ మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా అందించబోతున్నామని శ్రేయస్ మీడియా వెల్లడించింది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని మొదట అనుకున్నప్పటికీ 2026, జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు శ్రేయస్ మీడియా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. 

కన్నడనటి రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా నటిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌తో సహా నాజర్, శీను తదితరులు ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వచ్చే నెల 14తో ఈ షెడ్యూల్‌ ముగుస్తుంది. దీని తర్వాత షెడ్యూల్‌ కూడా కర్ణాటకలో అడవులలో తీయబోతున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు.