హిట్-3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి

శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హిట్-3’ సినిమా మే 1వ తేదీన విడుదల కాబోతోంది. కనుక ఈ రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. 

 శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడం, ఇప్పుడు హిట్-3లో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసరుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి వస్తుండటం కూడా సినిమాకి పాజిటివ్ బజ్ పెరిగేలా చేస్తుంది.    

హిట్-3కి సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2.37 గంటలు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. హిట్-3లో రావు రమేష్, బ్రహ్మాజీ, అడవి శేష్, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాల, మాగంటి శ్రీనాధ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.

వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రశాంత్ తీపిర్నేని కలిసి నిర్మించిన హిట్-3 మే 1వ తేదీన విడుదల కాబోతోంది.