
కింగ్ నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, విమల రామన్ లు నటిస్తున్నారు. అయితే ఇప్పటికే నాగార్జున, అనుష్క లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు ఆ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ లుక్ ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ గా రిలీజ్ చేసిన ఈ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది ప్రగ్యా జైశ్వాల్. పట్టు పరికిణీలో అందాల ముద్దుగుమ్మగా ప్రగ్యా అదరగొడుతుంది.
హతిరాం బాబా బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదట సంక్రాంతికి రిలీజ్ అని చెప్పినా ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిబ్రవరికి మార్చే అవకాశాలున్నాయట. వరుస హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నాగార్జున మరోసారి ఈ భక్తి చిత్రంతో కూడా బాక్సు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.
సినిమాలోని అనుష్క లక్ష్మిగా కనిపించగా.. ప్రగ్యా జైశ్వాల్ ట్రెడిషనల్ లుక్ లో సర్ ప్రైజ్ ఇచ్చింది. రాఘవేంద్ర రావు డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా మహేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.