
సీనియర్ నటుడు నరేష్ కు చెంపదెబ్బ బహుమానంగా అందించారు తన మదర్ దర్శక నిర్మాత విజయ నిర్మల. రీసెంట్ గా నరేష్ విలన్ గా నటించిన ఘటన సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కామాంధుడిగా నరేష్ అదరగొట్టాడు. నిత్యా మీనన్ మీద ఎటాక్ చేసే నరేష్ తన పాత్రకు తాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. అయితే ఈ క్రమంలో సినిమా చూసిన విజయ నిర్మల నరేష్ కు చెంపదెబ్బ బహుమానంగా ఇచ్చారట.
విలన్ గా బాగా చేశావని చెంపదెబ్బ వేశారట విజయ నిర్మల. శ్రీ ప్రియ డైరక్షన్లో వచ్చిన ఘటనలో నిత్యా మీనన్ లీడ్ రోల్ చేసింది. సినిమా టాక్ ఎలా ఉన్నా సరే నిత్యా నటనతో పాటుగా నరేష్ లోని విలనిజం ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. నరేష్ కు ఇన్నాళ్లు కామెడీ పాత్రలనే ఇస్తూ వస్తున్న దర్శక నిర్మాతలకు తనలోని మరో యాంగిల్ తో అదరగొట్టాడు.
తన సీనియారిటీ ఏంటి అనేది ఘటన సినిమాలో విలన్ గా నటించినప్పుడు తెలిసింది. నిత్యా కు పోటీగా నరేష్ నటన తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.