అల్లు ఇంట పండుగ వాతావరణం..!

అల్లు వారి ఇంట పండుగ వాతావరణం ఏర్పడింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలకు పాప పుట్టడంతో అల్లు కాంపౌండ్ మొత్తం ఆనందంలో మునిగితేలుతుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు ఈ విషయాన్ని తెలియచేస్తూ ట్వీట్ చేశాడు. చాలా హ్యాపీగా ఉందంటూ అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ తన ఫ్యాన్స్ కే కాదు మెగా ఫ్యాన్స్ కు కూడా సంతోషాన్ని తెచ్చిపెట్టింది.

ఒక కొడుకు..  ఓ కూతురు.. ఇంతకంటే ఏం కావాలి.. నేను చాలా అదృష్టవంతున్ని అంటూ అల్లు అర్జున్ కాస్త ఎమోషనల్ గా తన ఫ్యాన్స్ కు ట్వీట్ చేశాడు. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న బన్ని ఓ వైపు తన కుటుంబ విషయంలో కూడా ఎంతో బాధ్యతగా ఉంటున్నాడు. ఈ సంవత్సరం సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బన్ని ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఛార్మింగ్ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.