
ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తుండగా, ఇప్పుడు ఊహించని కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆ సినిమా దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు.
గతంలో తాను స్వరపరిచిన మూడు పాటలకు తన అనుమతి తీసుకోకుండా గుడ్ బ్యాగ్ అగ్లీలో రిక్రియేట్ చేసినందుకు తక్షణం వాటిని సినిమాలో నుంచి తొలగించి తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఇళయరాజా లీగల్ నోటీస్ పంపారు. తన అనుమతి లేకుండా తన పాటలను వాడుకునందుకు తనకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే కోర్టు కేసు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఇళయరాజా లీగల్ నోటీస్ పంపారు.
ఇళయరాజా గతంలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కూడా ఇదే విదంగా లీగల్ నోటీస్ పంపి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఇళయరాజా పాటలు పాడలేదు. ఆయనని కలవడానికి కూడా ఇష్టపడలేదు.
సినీ పరిశ్రమలో ఇంత గౌరవం, పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకున్న ఇళయరాజా ఈ వయసులో ఈవిదంగా విచిత్రంగా ప్రవర్తిస్తుండటం చూసి సినీ పరిశ్రమలో వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇళయరాజా పంపిన నోటీసుపై గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శక నిర్మాతలు, హీరో అజిత్ కుమార్ ఇంకా స్పందించాల్సి ఉంది.