
అక్కినేని హీరోలలో నాగ చైతన్య అప్పుడప్పుడు హిట్స్ కొట్టగలుగుతున్నారు కానీ అతని తమ్ముడు అఖిల్ అక్కినేని ఎన్ని సినిమాలు చేస్తున్నా హిట్ దక్కడం లేదు. నాగ చైతన్య ‘తండేల్’తో హిట్ కొట్టాడు కనుక ఇప్పుడు అఖిల్ వంతు అని ఎదురుచూడాల్సిన పరిస్థితి.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ ‘లెనిన్’ అనే కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో ‘లక్కీ స్టార్’, ‘డాన్సింగ్ క్వీన్’ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. నిన్న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ టైటిల్ గ్లింమ్స్ విడుదల చేశారు.
ఫస్ట్ గ్లింమ్స్‌లో “గతాన్ని తరమటానికి పోతా .. మా నాయిన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా పేరుండదు అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటాది” డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
లెనిన్ సినిమాకు కధ, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరి, సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.