
మిల్కీ బ్యూటీ తమన్నా సీనియర్స్ కేటగిరీలోకి మారిన తర్వాత కధ, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. 2022 లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తీసిన ఓదెల-2లో ఆమె శివశక్తి సాధువుగా చేశారు. నిన్న విడుదలైన ఓదెల-2 ట్రైలర్‌లో లోకాన్ని కబళించాలని ప్రయత్నించే దుష్టశక్తికి వారిని కాపాడేందుకు వచ్చిన పరమేశ్వరుడి ప్రతినిధికి మద్య జరిగే యుద్ధమే ఈ సినిమా కధ అని స్పష్టమైంది.
గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, తమన్నా నటన అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే, అరుంధతి సినిమాతో అనుష్క ఎంత పేరు సంపాదించుకున్నారో, ఈ సినిమాతో తమన్నా కూడా అంత పేరు సంపాదించుకోబోతున్నారనిపిస్తుంది.
ఈ సినిమాలో హర్ష పటేల్, వశిష్ట ఎన్ సింహా, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది, సంగీతం: అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: సౌందర రాజ్యం, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
ఈ సినిమాని మధూ క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ఓదెల-2 విడుదల కాబోతోంది.