
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ది రాజాసాబ్’ మొదట చిన్న బడ్జెట్ సినిమా అనే అందరూ అనుకున్నారు. కానీ కల్కితో పాన్ ఇండియా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్‌తో సాదాసీదా సినిమా తీస్తే సరిపోదని, భారీ బడ్జెట్‌తో అన్ని హంగులతో పాన్ ఇండియా మూవీగా సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నమ్మినవారి చేతిలో మోసపోయి హత్య చేయబడిన ‘రాజాసాబ్’గా ఓ పాత్ర, ఆయన మనుమడిగా మరో పాత్ర చేస్తున్నారు. రాజాసాబ్ ఆత్మ పాడుబడిన తన ప్యాలస్‌లో ఉండిపోతుంది. దానిలోకి మనుమడు ప్రవేశించడంతో అసలు కధ మొదలవుతుందని తెలుస్తోంది.
రాజాసాబ్ మొదలుపెట్టి అప్పుడే ఏడాదిపైనే అవుతున్నా దర్శకుడు మారుతి ఈ సినిమాకు సంబందించి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. వారికి సంతోషం కలిగించే విషయాలు కూడా చెప్పారు.
ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు త్వరలోనే పూర్తవుతాయి. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని దర్శకుడు మారుతి చెప్పిన్నట్లు తెలుస్తోంది. మొదట ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ గ్రాఫిక్ వర్క్స్ పూర్తికాకపోవడంతో రాజాసాబ్ వాయిదా తప్పలేదు. గ్రాఫిక్స్ పూర్తికాగానే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి, ఆ తర్వాత వరుసగా పాటలు విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.