
పుష్ప-1,2లతో రెండు అతిభారీ హిట్స్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా మొదలుపెడుతున్నారు. దీని కోసం వారిరువురూ అమెరికాలో లాస్ ఏంజల్స్ల నగరానికి వెళ్ళి అక్కడి ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్ళారు. ఆ సంస్థలో పనిచేస్తున్న నిపుణులు ఇటువంటి అద్భుతమైన కధ, స్క్రిప్ట్ ఎన్నడూ చేయలేదని, సినిమా కధ వింటేనే గొప్ప అనుభూతి కలుగుతోందని, ఇటువంటి కధతో సినిమా చేయబోతున్నందుకు తామందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. వారు అల్లు అర్జున్-అట్లీలకు తమ స్టూడియో, దానిలో సృష్టించిన పాత్రలు, ఆయుధాలు వగైరా అన్నీ చూపారు. ఈ సందర్భంగా వారు వీఎఫ్ఎక్స్ కోసం అల్లు అర్జున్‌ని స్కానింగ్ చేసి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.
ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.