ఫస్ట్ గ్లింమ్స్‌తోనే పెద్ది హిట్?

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా తీస్తున్న ‘పెద్ది’ సినిమా ఫస్ట్ గ్లింమ్స్‌ ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా విడుదలైంది. గ్రామీణ క్రికెట్ నేపధ్యంతో ఈ సినిమా తీస్తున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌తోనే దర్శకుడు బుచ్చిబాబు చెప్పేశారు.

దానిలో రామ్ చరణ్‌ వేషం, యాక్షన్ చూసి తీరాల్సిందే. ముఖ్యంగా బ్యాటింగ్ క్రీజ్ నుంచి మూడడుగులు ముందుకు వచ్చి షాట్ కొట్టిన తీరు చూసి అభిమానులు ఉప్పొంగి పోతున్నారు. 

పుష్ప-1,2 చిత్తూరు యాసతో తీసినట్లుగానే ‘పెద్ది’ని ఉత్తరాంధ్ర యాసతో తీయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌ చూస్తే అర్దమవుతోంది. తెలంగాణ ప్రజల యాసని ఆంధ్రావాళ్ళు అర్ధం చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నట్లే, ఆంధ్రాలో వివిద యాసలని తెలంగాణ ప్రజలు అర్దం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. సినిమా ఎంత బాగున్నప్పటికీ ఇది ఓ డ్రాబ్యాక్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ తెలుగు సినిమాలను 5 భాషల్లో పాన్ ఇండియా మూవీలుగా తీస్తున్నారు కనుక ఆంధ్రా, తెలంగాణ యాసలో వేర్వేరుగా తీయగలరేమో దర్శక నిర్మాతలు ఆలోచిస్తే బాగుంటుంది.  దీని వలన ప్రేక్షకులు సినిమాతో మరింత బాగా కనెక్ట్ అవుతారు. ఈ చిన్న మార్పు సినిమా సూపర్ హిట్ అవడానికి మరింత తోడ్పడుతుంది కదా?  

ఈ భాష, యాసని పక్కన పెడితే పెద్ది ఫస్ట్ గ్లింమ్స్‌ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. ఇక నుంచి రామ్ చరణ్‌ అభిమానులు, సినీ ప్రేమికులు ‘పెద్ది’ కోసం ఎదురుచూపులు చూడటం మొదలుపెడతారని దర్శక నిర్మాతలు పసిగట్టారో ఏమో వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లో ప్రకటించేశారు.   

 ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.