
ఈ ఏడాది ఆగస్ట్ 14న రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీ హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్న కూలీ సినిమా ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ వేశారు.
కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకులలో ఒకరైన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బంగారం స్మగ్లింగ్ కధాంశంగా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీనిలో రజనీకాంత్ విశ్వరూపం చూపించబోతున్నారని కనగరాజ్ చెపుతున్నారు. ఆగస్ట్ 14న రిలీజ్ అంటూ రజనీకాంత్ ఫోటోతో వేసిన పోస్టర్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉంది.
ఇక జూ.ఎన్టీఆర్ తొలిసారిగా చేస్తున్న డైరెక్ట్ హిందీ సినిమా వార్-2. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇటువంటి భారీ యాక్షన్ మూవీలు తీయడంలో మంచి పేరున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది.
రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. రెండు యాక్షన్ సినిమాలే. రెండింటిలో పెద్ద హీరోలే ఉన్నారు. రెండింటి దర్శకులు హేమాహేమీలే. కనుక ఈ రెండు సినిమాల మద్య ఆగస్ట్ 14న నిజంగానే వార్ జరుగబోతోంది. రెండింటిలో ఏది గెలుస్తుందో లేదా రెండూ గెలుస్తాయో తెలియాలంటే ఆగస్ట్ 14వరకు ఎదురు చూడాల్సిందే.