శ్రీ విష్ణు శిల్పి ఎవరో.. లిరికల్ సాంగ్‌

శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో వస్తున్న ‘శిల్పి ఎవరో’ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. శ్రీమణి వ్రాసిన ఈ పాటని విశాల్ చంద్రశేఖర్‌ స్వరపరచగా, యజిన్ నిజార్ ఆలపించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ రాజు, డైలాగ్స్: భాను భోగవరపు, నందు సావిరిగన, సంగీతం: విశాల్ చంద్రశేఖర్‌, కెమెరా: ఆర్‌. వేల్ రాజ్, ఎడిటింగ్: కేఎల్. ప్రవీణ్, ఆర్ట్: చంద్రిక గొర్రెపాటి చేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది.