
ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, దివ్య భారతి జంటగా నటించిన ‘కింగ్‌స్టన్’ గత నెల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 13 నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
సినిమా కధేమిటంటే.. తమిళనాడులో ఓ సముద్రతీరంలో నివసిస్తూ చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళి శవాలై తిరిగి వస్తుంటారు. ఆ భయంతో అందరూ సముద్రంలో చేపల వేటకు వెళ్ళడం మానుకుంటారు. ఆ కారణంగా ఆ గ్రామస్తుల పరిస్థితి దయనీయంగా మారుతుంది.
వారి పరిస్థితిని అవకాశంగా మలుచుకొని ఓ అసాంఘిక చర్యలకు పాల్పడే ముఠా ఊర్లోని యువకులను ఆకర్షిస్తుంది. ఆ ముఠాలో హీరో కింగ్‌స్టన్ (జీవీ ప్రకాష్ కుమార్) కూడా చేరుతాడు. ఆ క్రమంలో ఊర్లో యువకుడు చనిపోతాడు. దాంతో కింగ్‌స్టన్ ముఠాని ఎదిరించి ఊరికి తిరిగి వచ్చేస్తాడు.
వేరే ఉపాది మార్గం లేకపోవడంతో సముద్రంలో వేటకు వెళ్ళినవారు ఎందుకు చనిపోతున్నారో కనుగొని ఆ సమస్యని పరిష్కరించాలని కొందరు స్నేహితులను వెంటబెట్టుకొని సముద్రంలోకి వెళ్తాడు. అప్పుడు సముద్ర గర్భంలో ఆత్మలున్నాయని గ్రహించడంతో అసలు కధ మొదలవుతుంది. మిగిలిన కధ కింగ్‌స్టన్ ఓటీటీలోకి వచ్చాక చూసి తెలుసుకుంటే బాగుంటుంది.