
తెలుగు సినీ పరిశ్రమలో మంచి సక్సస్ రేట్ ఉన్న దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ‘జాట్’ అనే ఓ సినిమా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా చేసిన ‘టచ్ కియా’ అంటూ సాగే తొలి పాట (ఐటం సాంగ్) విడుదల చేశారు.
ఈ సినిమాలో రెజినా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటించగా రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ హిందీ సినిమాని మన తెలుగు సినీ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించగా తమన్ సంగీతం అందించారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
బాలీవుడ్లో ఓ సీనియర్ నటుడు సన్నీ డియోల్ హీరోగా రెండు తెలుగు సినీ నిర్మాణ సంస్థలు, తెలుగు దర్శకుడు, తెలుగు సంగీత దర్శకుడు, తెలుగు కొరియోగ్రాఫర్ కలిసి పాన్ ఇండియా మూవీగా సినిమా చేయడం మన అందరికీ గర్వకారణమే కదా?