చిరు సినిమాలో వెంకీ.. నిజమా?

దర్శకుడు అనిల్‌ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాటో వెంకటేష్‌కి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత  మెగాస్టార్ చిరంజీవికి అంత కంటే పెద్ద హిట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకొని ఓ సినిమా మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తయింది. త్వరలోనే షూటింగ్‌ మొదలవబోతోంది. ఈ సినిమాకి సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. సంక్రాంతికి విడుదలవబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారని దాని సారాంశం. 

ఈ సినిమాలో చిరంజీవి కోటాలో ఎలాగూ కొన్ని ఫైట్స్, డాన్సులు తప్పక ఉంటాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఓ డాన్స్ ఉండేలా అనిల్‌ రావిపూడి ప్లాన్ చేశారట! చిరంజీవితో పాటు వెంకటేష్‌కి కూడా కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయట! ఇదేమీ మల్టీస్టార్ సినిమా కాదు కానీ అనిల్‌ రావిపూడి ఇటువంటి ఆలోచన చేస్తున్నట్లయితే, వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా చాలా ప్రత్యేకమవుతుంది.