
శోభితా ధూళిపాళ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆమెలో ప్రతిభని గుర్తించిన దర్శకుడు మణిరత్నం తన పోననియం సెల్వన్ సినిమాలో కీలకపాత్ర ఇచ్చారు. మేడ్ ఇన్ హెవెన్, మేజర్ వంటి సినిమాలలో ఆమె నటనకు చాలా మంచి మార్కులే పడ్డాయి.
ఇప్పుడు ఆమెకు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తీస్తున్న ‘సార్పట్ట పరంపర-2’ సినిమాలో ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తోంది. దీనిలో హీరోగా దినేష్ నటిస్తుండగా విలన్‌గా ఆర్య నటిస్తున్నారు.
వారిరువురి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆటకత్తి’ సూపర్ హిట్ అయినందున ‘సార్పట్ట పరంపర-2’ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు శోభితా ధూళిపాళని తీసుకోవాలని పా. రంజిత్ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో అవకాశం లభిస్తే ఆమెకు గొప్ప అవకాశం లభించిన్నట్లే. నాగ చైతన్యతో పెళ్ళి తర్వాత చేస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది.