అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్‌….. పెర్‌ఫెక్ట్

నితిన్‌, భరత్‌ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో ప్రదీప్ మాచర్ల, దీపిక జంటగా వస్తున్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. ట్రైలర్‌ ఆద్యంతం చక్కటి కామెడీతో అందరూ హాయిగా నవ్వుకునేలా ఉంది. ప్రదీప్ మాచర్ల నటన కూడా చాలా బాగుంది.  

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జీఎం సుందర, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, డైలాగులు: సందీప్ బొల్లా, సంగీతం: రాధన్‌, కెమెరా: ఎంఎన్ బాలిరెడ్డి, కొరియోగ్రఫీ: శేఖర్ వీజె, ఎడిటింగ్: పీకే చేశారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కలిసి ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.