అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి నుంచి మొదటి పాట

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలలో ‘అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి’ నుంచి మంచి మాస్ బీట్ లిరికల్ వీడియో సాంగ్‌ సోమవారం విడుదల చేశారు. 

‘నాయాల్ది నాయుడేమన్నాడే..’ అంటూ సాగే రఘు రామ్ వ్రాసిన ఈ పాటని అజనీష్ లోక్‌నాధ్ స్వరపరచగా నకాశ్ అజీజ్, సోనీ కొమండూరి కలిసి పాడారు. 

ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్ర చేశారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, సొహైల్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి, సంగీతం అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. 

ఈ వేసవి సెలవుల్లో ‘అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి’ విడుదల కాబోతోందని నిన్న విడుదల చేసిన టీజర్‌లో మరోసారి వెల్లడించారు.