విజయ్ సేతుపతి-పూరీ జగన్నాధ్ సినిమా

ఒకప్పుడు వరుసపెట్టి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు పూరీ జగన్నాధ్ చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బందిపడుతున్నారు. విజయ్ దేవరకొండతో చేసిన ‘లైగర్’ ఆయన సినీ జీవితంలో అతిపెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. దాని నుంచి తేరుకోవడానికి పూరీకి చాలా సమయమే పట్టింది. 

ఇంతకాలం తర్వాత పూరీ మరో పెద్ద హీరోతో కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు. విలక్షణమైన కధలు, పాత్రలు, సినిమాలతో తెలుగు ప్రజలను సైతం మెప్పిస్తున్న కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేయబోతున్నారు. 

పూరీ, ఛార్మీల సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో ఈ సినిమా చేయబోతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మొదలవుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.