
బుచ్చిబాబు కాంబినేషన్‌లో తీస్తున్న ‘పెద్ది’ ఫస్ట్-లుక్ పోస్టర్ రామ్ చరణ్ రోజున విడుదల చేయగా వైరల్ అవుతోంది. దానిలో రామ్ చరణ్ ఓ చేతిలో చుట్ట పట్టుకొని వెనక్కు తిరిగి నిలబడిన ఫోటో చూసి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు.
ఇవాళ్ళ ఉగాది సందర్భంగా ఫస్ట్ గ్లింమ్స్ విడుదల చేస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ గ్లింమ్స్ విడుదల చేస్తామంటూ మరో పోస్టర్ వేశారు. చుట్టూ ఎర్ర జెండాలు పట్టుకొని జనాలు నిలబడి ఉండగా రామ్ చరణ్ వారిపై నుంచి హైజంప్ చేస్తున్నట్లు పోస్టర్లో చూపారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు.
సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.