బన్ని చూపు ఆమెపై పడ్డదా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెను సెలెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు బన్ని. ఆ క్రమంలో లింగుస్వామితో చర్చలు జరుపుతున్నాడట. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తే ప్రస్తుతం అక్కడ ఇక్కడ ఓ ఊపు ఒప్పేస్తున్న కీర్తి సురేష్ పేరు వచ్చిందట.

ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్స్ తో సినిమా చేస్తున్న కీర్తి సురేష్ అటు ఓ పక్క కోలీవుడ్లో కూడా విజయ్ సినిమాలో నటిస్తుంది. అందుకే తెలుగు తమిళ్ లో రూపొందే ఈ సినిమాలో కీర్తి అయితే బాగుంటుంది అని అలా డిసైడ్ చేశారట. అయితే ఈ డిస్కషన్ ఇంకా కీర్తి దాకా వెళ్లలేదట. ఎలాగు బన్ని హరీష్ శంకర్ సినిమాకు టైం పడుతుంది కాబట్టి ఈలోపే అమ్మడు కమిట్ అయిన సినిమాలన్ని కంప్లీట్ చేసేయొచ్చు. 

మొత్తానికి బన్ని చూపు కూడా కీర్తి సురేష్ మీద పడ్డదన్నమాట. నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం నాని నేను లోకల్ లో నటిస్తుంది.