ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చేస్తున్నారు. వీటి తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయబోతున్నారు. అమెరికాలో తెలుగువారు జరుపుకుంటున్న ఉగాది వేడుకలకు హాజరైన సందీప్ వంగాని ‘స్పిరి’ అప్‌డేట్ ఇమ్మనమని కోరగా “మెక్సికోలో లొకేషన్స్ చూసుకోవడానికి వచ్చాము. త్వరలో అక్కడే షూటింగ్ మొదలుపెట్టబోతున్నాము. ప్రస్తుతం ఇదే నేను ఇవ్వగల అప్‌డేట్,” అని చెప్పారు.
త్వరలో మెక్సికోలో ‘స్పిరిట్’ షూటింగ్ మొదలవబోతోందంటే ప్రభాస్ ‘రాజాసాబ్’, ఫౌజీ దాదాపు పూర్తిచేసేశారన్న మాట. లేకుంటే మెక్సికోలో షూటింగ్‌కి ఒప్పుకోరు కదా?స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించబోతున్నారని తెలిసిందే. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మన దేశంలో కాదు మెక్సికోలో పనిచేస్తుంటాడా?విలన్ గ్యాంగ్‌లతో ఫైటింగ్ సీన్స్ లేదా హీరోయిన్‌తో డ్యూయెట్ సాంగ్ కోసం మెక్సికో వెళ్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Finally An UGADI Treat 😍

We are Planning to Shoot #Spirit in #Mexico... currently location recce is going on, Shoot Starts Soon 🔥💥- Sandeep vanga#Prabhas pic.twitter.com/3GmsWVhMuX pic.twitter.com/8YKCqCFLnx
— PrabhasWarriors𝕏 (@PRABHASWARRlORS) March 30, 2025