చిరు-అనిల్‌ రావిపూడి సినిమా ప్రారంభం

నేడు ఉగాది పర్వదినం సందర్భంగా మెగాస్టార్-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా పూజా కార్యక్రమం జరుగుతోంది. ఈ పూజా కార్యక్రమంలో నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అర్జున్‌ అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్‌రాజు, నాగవంశీ, దర్శకులు కే రాఘవేంద్ర రావు, మల్లాది వశిష్ట, వంశీ పైడిపల్లి, బాబి, శ్రీకాంత్ ఓదెల, శివ నిర్వాణ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.  విక్టరీ వెంకటేష్‌ క్లాప్ కొట్టారు.   

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు ‘చిరునవ్వుల పండగ’ అనే టైటిల్‌ అనుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని 2026, జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి కనుక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు ‘శివశంకర్ వర ప్రసాద్.’ ఇది ఆయన అసలు పేరని అందరికీ తెలిసిందే. 

సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కలిసి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో అదితీరావు పేరుని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్‌ ఇంకా ఖరారు కావలసి ఉంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించబోతున్నారు.