
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన సినిమాలలో హరిహర వీరమల్లు సినిమా ఎలాగో పూర్తిచేశారు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘ఓజీ’ సినిమాల పరిస్థితే అయోమయంగా మారింది.
అయితే ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందే వీటిలో ‘ఓజీ’ షూటింగ్ 50 శాతం పూర్తయిన్నట్లు తాజా సమాచారం. కనుక మే-జూన్ నెల మద్యలో ఓ 25 రోజులు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకొని ‘ఓజీ’ పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలకు హామీ ఇచ్చిన్నట్లు తాజా సమాచారం.
కనుక ఓజీ షూటింగ్ కోసం త్వరలోనే ఏర్పాట్లు మొదలుపెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిచేసేస్తే మిగిలిన నటీనటులు చేయవలసిన సన్నివేశాలను నెలరోజులలో పూర్తి చేసేసి, ఈ ఏడాది దసరా దీపావళి పండుగ సీజనులో ‘ఓజీ’ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.