కన్నప్ప వాయిదా.. అందుకేనా?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరోసారి వాయిదా పడింది. కన్నప్ప ఏప్రిల్ 25న విడుదలచేస్తామని ప్రకటించినప్పటికీ, వీఎఫ్ఎక్స్‌ పనులు ఆలస్యం అవుతుండటంతో కొన్ని వారాలు వాయిదా వేసుకోక తప్పడం లేడని మంచి విష్ణు చెప్పారు. 

అయితే మంచు సోదరుల ఇద్దరి మద్య గొడవలు జరిగినప్పుడు మంచు మనోజ్ ‘కన్నప్ప’ సినిమా ఫ్లాప్ అవుతుందన్నారు. కన్నప్ప రిలీజ్‌ డేట్ ప్రకటించిన తర్వాత మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన ‘భైరవం’ కూడా అదే రోజున రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో కన్నప్పని దెబ్బతీయడానికే మనోజ్ ఆవిదంగా చేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  కనుక తమ్ముడితో తలనొప్పులు వద్దనుకొని విష్ణు తన కన్నప్పని వాయిదా వేసుకొని ఉండవచ్చు. 

విజయ్ దేవరకొండ కనకమేడల దర్శకత్వంలో రాధామోహన్ ‘భైరవం’ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళ్లై తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.