
మెగా పవర్ స్టార్ రాం చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ధ్రువ. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల క్రితం దాకా షూటింగ్ జరుపుకుంటుంది అని అన్నారు తీరా చూస్తే ఈరోజు మార్నింగ్ ధ్రువ సెన్సార్ కు వెళ్లిందట. యు/ఏ సర్టిఫికెట్ తో ధ్రువ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చరణ్ చాలా స్టైలిష్ గా ఉంటాడట.
ఇక సెన్సార్ రిపోర్ట్ నుండి వచ్చిన టాక్ ఏంటంటే మొదటి భాగం మొత్తం కామెడీతో నింపేసిన సురేందర్ రెడ్డి సెకండ్ హాఫ్ సినిమాను బాగా నడిపించాడట. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత్ సంవత్సరం గ్యాప్ తీసుకుని మరి వస్తున్న చెర్రి ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడట. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. ఇక డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.