
నేనింతే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అభినయ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనుంది. ఈ నెల 9న తన బాల్య స్నేహితుడు, సన్నీవర్మతో వివాహ నిశ్చితార్ధం జరిగిందని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలని పోస్ట్ చేశారు. అతనితో తాను 15 సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నానని, నా వ్యక్తిగత విషయాలు ఏవైనా అతనితో నిర్భయంగా పంచుకోగలనని, త్వరలో తాము పెళ్ళి చేసుకోబోతున్నామని అభినయ పేర్కొన్నారు. సన్నీవర్మ ఒక అంతర్జాతీయ కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
అభినయ అనేక సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో చేసిన చిన్న పాత్ర మంచి గుర్తింపునిచ్చింది.