
ఓ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి చాలా నిజాయితీగా, ధైర్యంగా పనిచేస్తూ రూ.4,200 కోట్లు అక్రమాస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేసి చూపినందుకు 74సార్లు బదిలీ అయితే? అయినా అదే నిబద్దతతో పనిచేస్తుంటే? రియల్ లైఫ్ హీరో అవుతాడు.
ఇటువంటి కధతో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన సినిమా ‘రైడ్’ సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్‌గా రైడ్-2 వస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. “నేను పాండవుడినని ఎప్పుడన్నాను... నేనే ఓ మహాభారతాన్ని,” వంటి డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో అజయ్ దేవగణ్ , రితేష్ దేశ్ ముఖ్, వాని కపూర్, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
పనోరమ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై గుల్షన్ కుమార్-టీ సిరీస్ సమర్పణలో కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.