
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఫ్యామిలీ మ్యాన్-1, 2 వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటికి కొనసాగింపుగా ఫ్యామిలీ మ్యాన్-3 సీదామ అవుతోంది. ఓ సాధారణ మద్యతరగతి కుటుంబానికి చెందిన మనోజ్ బాజ్‌పాయ్ ‘రా’ ఏజంట్‌గా పనిచేస్తూ, పైకి మాత్రం చిన్న ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలతో చాలా సాధారణ జీవితం గడుపుతుంటాడు. కనుక ఈ వెబ్ సిరీస్‌కి ‘ఫ్యామిలీ మ్యాన్’ టైటిల్ చాలా చక్కగా సరిపోతుంది.
ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ విడుదల చేసిన వెంటనే ఫ్యామిలీ మ్యాన్-3 షూటింగ్ మొదలు పెట్టేశారు. గత రెండేళ్ళుగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు మూడు నెలల్లో పూర్తవుతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు మనోజ్ బాజ్‌పాయ్ ఇటీవల తెలిపారు.
‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న జైదీప్ అహ్లావత్ ఫ్యామిలీ మ్యాన్-3లో విలన్‌గా నటిస్తున్నారని మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు.