
రాజు అనగానే నిర్మాతగా ఇప్పుడు ఫాంలో ఉన్న దిల్ రాజు మాత్రమే గుర్తొస్తాడు. అయితే అసలు దిల్ రాజు ఈ రేంజ్ నిర్మాతగా నిలబడటానికి స్పూర్తిగా నిలిచిన ఎం.ఎస్ రాజు గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఎం.ఎస్ రాజు సినిమా అంటే చాలు ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అన్నది కూడా ఆలోచించకుండా సినిమా చూసేవారు. అయితే కొద్దికాలంగా నిర్మాతగా ఆపేసి దర్శకుడిగా ఒకటి రెండు ప్రయత్నాలు చేసిన రాజు ఇప్పుడు రతి సినిమాను తీస్తున్నారట.
తెలుగు..తమిళ.. కన్నడ..మలయాళం.. హింది.. మరాఠి భాషల్లో ఒకేసారి ఈ సినిమా నిర్మిస్తున్నారట. అప్పట్లో త్రిషతో రమ్ సినిమా చేసే ప్రయత్నం చేసినా ఎందుకో రాజు ఆ సినిమా పట్టాలెక్కించలేకపోయారు ప్రస్తుతం రతి సినిమా గురించి ఎనౌన్స్ చేసిన రాజు త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అన్నారు. ఎరోటిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు తనే డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఎం.ఎస్. రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్న సుమంత్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో వెనుకపడ్డాడు.