
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా చేసిన రాబిన్ హుడ్ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మీడియాతో చిట్ చాట్ చేస్తూ తమ బ్యానర్‌లో వచ్చే ఏడాది రాబోతున్న సినిమా వివరాలు చెప్పారు.
వచ్చే ఏడాది వరుసగా ఆరు సినిమాలు విడుదల చేయబోతున్నామని చెప్పారు. వాటిలో ప్రభాస్-హను రాఘవపూడి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యన్, రిషబ్ శెట్టి-ప్రశాంత్ వర్మ, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమాలున్నాయని చెప్పారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న జై హనుమాన్ సినిమాలో నటిస్తున్న రిషబ్ శెట్టి ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని రవిశంకర్ చెప్పారు.
ఇక రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో తీస్తున్న సినిమా గ్లింమ్స్ చూశానని, ఆ ఒక్క సన్నివేశం కోసం ప్రేక్షకులు ఈ సినిమాని వెయ్యిసార్లు చూస్తారని అంత అద్భుతంగా ఉందన్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో పూర్తి కావలసి ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిపోవడంటో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ అతికష్టం మీద హరిహర వీరమల్లుకి సమయం కేటాయించి ఎలాగో షూటింగ్ పూర్తిచేశారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ పూర్తిచేసే పరిస్థితి కనబడటం లేదు. కనుక వాటి కోసం ఎదురుచూపులు అనవసరమే.