
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలలో ‘మ్యాడ్ స్క్వేర్’ మరో 48 గంటల్లో అంటే శుక్రవారం విడుదల కాబోతోంది. కనుక ట్రైలర్ వదిలారు. టీజర్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా ట్రైలర్ వాటిని మరింత పెంచేసింది. రెండు నిమిషాల ట్రైలర్ చూసి నవ్వకుండా ఉండటం చాలా కష్టమే. అందరూ పోటీపడుతున్నట్లుగా కామెడీ పండించారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమాకు కధ, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: శామ్దత్, ఆర్ట్: పెనుమర్తి ప్రసాద్, ఫైట్స్: కరుణాకర్ చేశారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సూర్యదేవర ఈ సినిమా నిర్మించారు.