లవ్వుతో అలా మాట్లాడాను.. తప్పే.. సారీ: రాజేంద్ర ప్రసాద్

నితిన్‌, శ్రీలీల జంటగా చేసిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు. మద్యం మత్తులో ఆవిదంగా మాట్లాడి ఉంటారని సరిపెట్టుకున్నప్పటికీ అందరూ ఆయన తీరుని తప్పు పడుతున్నారు. 

దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, “మా తెలుగు సినీనటీనటులంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే మా అందరికీ కూడా ఆయనంటే చాలా ఇష్టం.. ప్రేమ. అందుకే నేను అలా మాట్లాడాను తప్ప ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కావు. అయినప్పటికీ నా మాటలకు మీరందరూ బాధపడుతున్నట్లయితే అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఇకపై ఎన్నడూ ఈవిదంగా జరగదని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.