నాని, శ్రీనిధి శెట్టి..... ప్రేమ వెల్లువ

శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా చేసిన హిట్-3 నుంచి ‘ప్రేమ వెల్లువ..’ అంటూ సాగే తొలి పాట విడుదలైంది. 

కృష్ణ కాంత్ వ్రాసిన పాటని మిక్కీ జె మేయర్‌ అద్భుతంగా స్వరపరచగా సిద్ శ్రీరామ, నూతన మోహన్ కలిసి మృధుమధురంగా ఆలపించారు. హిట్ సిరీస్‌లో వస్తున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. 

ఇదో పూర్తి యాక్షన్ సినిమా. దీనిలో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్న హీరో నాని హీరోయిన్‌తో ప్రేమలో పడటం వారి మద్య ఇంత చక్కటి రొమాంటిక్ సాంగ్‌ చాలా బాగుంది.   

ఈ సినిమాలో రావు రమేష్, బ్రహ్మాజీ, అడవి శేష్, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాల, మాగంటి శ్రీనాధ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.

వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రశాంత్ తీపిర్నేని కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, మే 1వ తేదీన విడుదల కాబోతోంది.