
వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తే కామెడీ, యాక్షన్, రొమాన్స్ అన్నీ సమపాళ్ళలో పడటంతో అద్భుతంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించే చక్కటి కమర్షియల్ సినిమాగా హిట్ కొట్టే అవకాశం కనిపిస్తోంది.
ట్రైలర్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని కూడా చూపించడంతో అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, దేవదత్త నాగే, మీమ్ గోపి, షిజు, షైన్ టామ్ చాకో, కేతికా శర్మ తదితరులు నటించారు.
#Robinhood Event turns into a celebration with #DavidWarner's Dance.👌👌pic.twitter.com/F08XvA7oTI
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది.