
బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా, వినీత్ కుమార్ ప్రధాన పాత్రలలో ‘జాట్’ అనే హిందీ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రమో నేడు విడుదలైంది. సోమవారం పూర్తి ట్రైలర్ విడుదలవుతుంది. అయితే ఇన్ని తెలుగు సినిమాలుండగా ఓ హిందీ సినిమా గురించి మాట్లాడుకోవడం అవసరమా? అనే సందేహం కలుగవచ్చు.
మన తెలుగు సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మన తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమాకి మన ధమన్ సంగీతం అందిస్తున్నారు. కనుక తెలుగు దర్శకనిర్మాతలు తీస్తున్న ఈ హిందీ సినిమా గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవడం అవసరమే.
ఈ సినిమాకు సంగీతం: తమన్, స్టంట్స్: రామ్ లక్ష్మణ్, కొరియోగ్రాఫర్: అనల్ ఆరాసు, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.