
తమిళ సినీ నటుడు విక్రమ్ అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు. అటువంటిదే వీర ధీర శూర-2. పొలిటికల్, క్రైమ్, యాక్షన్ నేపధ్యంతో తీసిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ చాలా ఆకట్టుకుంటోంది.
అరుణ్ కుమార్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో విక్రమ్, ఎస్‌జే సూర్య, దూషర విజయన్, సూరజ్ వెంజరమూడు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: థేని ఈశ్వర్, ఎడిటింగ్: ప్రసన్న జీకే, స్టంట్స్: ఫొనిక్స్ ప్రభు, ఆర్ట్: సిఎస్ బాలచందర్ చేశారు.
హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిభూ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న 5 భాషల్లో విడుదల కాబోతోంది.