హైదరాబాద్‌ చేరుకున్న డేవిడ్ వార్నర్

ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. వెంకీ కుడుమల, నితిన్‌-శ్రీలీల కాంబినేషన్‌లో తీసిన ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ఆయన అతిధి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నోవాటెల్ హోటలలో ‘రాబిన్‌హుడ్’ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. 

ఆయనకు ‘రాబిన్‌హుడ్’ చిత్ర బృందం, అభిమానులు శంషాబాద్ విమానాశ్రయంలో సాధరంగా స్వాగతం పలికారు. ఆయన అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగారు. డేవిడ్ వార్నర్ పుష్ప వంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలలో పాటలకు స్టెప్పులు వేస్తూ, ‘తగ్గేదేలే..’ అంటూ అభిమానులను అలరిస్తుంటారు.

 వాటిని గమనించిన దర్శకుడు వెంకీ కుడుమల ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ పాత్ర సృష్టించి ఆయనని ఒప్పించి చేయించారు. ఈరోజు సాయంత్రం ట్రైలర్‌ విడుదలైతే దానిలో డేవిడ్ వార్నర్ ఏవిదంగా నటించారో తెలియవచ్చు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు.  

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్‌’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది.