
శైలేష్ కొలను-నాని కాంబినేషన్‌లో ‘హిట్’ సిరీస్‌లో భాగంగా తీస్తున్న హిట్-3 నుంచి ‘ప్రేమ వెల్లువ..’ అంటూ సాగే తొలి పాట ప్రమో నేడు విడుదల చేశారు. సోమవారం పూర్తి పాట విడుదల కాబోతోంది. నాని, శ్రీనిధి శెట్టిలపై తీసిన ఈ రొమాంటిక్ సాంగ్ ప్రమో చాలా మృధుమధురంగా ఉంది.
ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా రావు రమేష్, బ్రహ్మాజీ, అడవి శేష్, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాల, మాగంటి శ్రీనాధ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రశాంత్ తీపిర్నేని కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, మే 1వ తేదీన విడుదల కాబోతోంది.