ఓ భామ అయ్యో రామ.. టీజర్‌ 24న

విభిన్నమైన కధలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న యువ నటుడు సుహాస్ రామ్ గోదాల దర్శకత్వంలో ప్రారంభించిన ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా షూటింగ్‌ పూర్తి చేశాడు. ఇదో రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని సినిమా టైటిలే చెపుతోంది. మరి ఇది ఎలా ఉందో సోమవారం టీజర్‌ విడుదలైతే తెలుస్తుంది. సోమవారం ఉదయం 11.07 గంటలకు టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ వేశారు. 

ఈ సినిమాలో మలయాళ నటి మాళవిక మనోజ్, సుహాస్‌కు జోడీగా నటించింది. అనిత హంస నందిని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృధ్వీరాజ్, ప్రభాస్‌ శ్రీను, రాఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: మణికందన్, ఆర్ట్: బ్రహ్మ కడలి చేశారు. వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్‌ నల్లా, ప్రదీప్ తాళ్ళు కలిసి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.