
వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’ నుంచి ‘అదిదా సర్‌ప్రీజు..’ అంటూ సాగే ఐటం సాంగ్ లిరిక్స్, శేఖర్ మాస్టర్ చేసియా కొరియోగ్రఫీకి కేతికా శర్మ వేసిన స్టెప్పులపై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మహిళా కమీషన్ కూడా తీవ్ర అభ్యంతరం చెపుతూ సంజాయిషీ కోరింది.
ఈ విమర్శలపై హీరో నితిన్ స్పందిస్తూ, “ఆ పాటలో నేను డాన్స్ చేయలేదు. అయినప్పటీకీ ఆ పాటతో సహా సినిమాకి నాకూ పూర్తి బాధ్యత ఉంది కనుక స్పందిస్తున్నాను. ఈ పాటని, డాన్సుని చాలా మంది ఆనందిస్తున్నారు. కానీ కొంతమంది విమర్శిస్తున్నారు.
నేను అందరి అభిప్రాయాలు గౌరవిస్తాను. మేమందరం సినిమా బాగా వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాము. ఆ పాటని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ట్రోలింగ్ చూసిన తర్వాత ఎక్కడో తేడా జరిగిందని నాక్కూడా అర్దమైంది. దీని గురించి వెంకీ కుడుముల, శేఖర్ మాస్టర్ చర్చిస్తున్నారు. వారు తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను,” అని నితిన్ అన్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది.