మహేష్ బాబు కొడుకు గౌతమ్‌ నటన చూశారా?

మహేష్ బాబు కొడుకు గౌతమ్‌ కూడా సినీ పరిశ్రమలో ప్రవేశించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అతను న్యూయార్క్‌లో ‘టిక్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో నటనలో శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల అతని స్నేహితులు తీసిన ఓ చిన్న వీడియో స్కిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిలో గౌతమ్‌ ఓ హోటల్లో గర్ల్ ఫ్రెండ్‌తో నవ్వుతూ మాట్లాడుతుంటే, ఆమె ఏదో చెప్పడంతో కోపంతో అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన్నట్లు ఆ వీడియోలో చూపారు. దానిలో గౌతమ్‌ రూపురేఖలు, హవభావాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 

గౌతమ్‌ కొంత కాలం క్రితం లండన్‌లో తొలిసారిగా ఓ డ్రామాలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఈ తాజా స్కిట్‌తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని స్పష్టం చేసిన్నట్లే భావించవచ్చు. ఈ స్కిట్ చూస్తే అతను తప్పకుండా మంచి నటుడు అవుతాడని, తండ్రికి తగిన వారసుడుగా నిలుస్తాడనిపిస్తుంది. మీరూ ఓ లుక్‌ వేసి అవునో కాదో తెలుసుకోండి.