జాక్ నుంచి ముద్దు ముద్దుగా ముద్దు పాట…

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ‘జాక్’ నుంచి భాగ్యనగరం అంతా మనదే అంటూ ముద్దుముద్దుగా సాగే ముద్దు పాట (కిస్ సాంగ్‌) విడుదలైంది. ప్రేమించిన యువతిని తొలిముద్దు పెట్టుకోవాలనే హీరోగారి తాపత్రయాన్ని పాట రూపంలో ఎక్కడా అశ్లీలత లేకుండా చాలా చక్కగా చూపారు.   

సనరే వ్రాసిన ఈ ముద్దు పాటని సురేష్ బొబ్బిలి స్వరపరిచగా జావేద్ అలీ, అమల చేబోలు చాలా మృధు మధురంగా పాడారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం, రాజు సుందరం కొరియోగ్రఫీ, విజయ్ కే చక్రవర్తి కెమెరా వర్క్ అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి.           

సూపర్ హిట్ ‘బొమ్మరిల్లు’ సినిమాలో హీరో తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కూడా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.  

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, రాధన్, అచు రాజమణి, శామ్; కెమెరా: విజయ్ కే చక్రవర్తి, ఎడిటింగ్: నవీన్ నూలి, కొరియోగ్రఫీ: రాజు సుందరం చేస్తున్నారు

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్‌, బాపినీడు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10 వ తేదీన విడుదల కాబోతోంది.